FASTag Smart Watch Scam: ఫాస్టాగ్ స్కామ్ వీడియో చూస్తే మతి చెడిపోవాల్సిందే, స్మార్ట్ వాచ్ తో డబ్బుల చోరీ, ప్రభుత్వం ఏం చెబుతోంది...

ఫాస్టాగ్ స్టిక్కర్లను స్మార్ట్ వాచ్ ల ద్వారా స్కాన్ చేసి పేటీఎం నుంచి డబ్బులు కొట్టేస్తున్నారన్నది ఈ వీడియో సారాంశం.

(Photo Credit: social media)

ఫాస్టాగ్ స్కామ్ పేరుతో ఈ వీడియో ఫాస్ట్ ట్యాగ్ యూజర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఫాస్టాగ్ స్టిక్కర్లను స్మార్ట్ వాచ్ ల ద్వారా స్కాన్ చేసి పేటీఎం నుంచి డబ్బులు కొట్టేస్తున్నారన్నది ఈ వీడియో సారాంశం. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోను గమనిస్తే రద్దీ సిగ్నల్ వద్ద కార్ విండ్ షీల్డ్ ను తుడుస్తున్నట్టు చేస్తున్న ఓ కుర్రాడి చేతికి డిజిటల్ వాచ్ తరహాలో ఓ పరికరం ఉంది. అయితే తను అద్దాలు తుడుస్తున్న సమయంలో ఆ స్మార్ట్ వాచ్ ద్వారా ఫాస్టాగ్ స్టిక్కర్ ని స్కాన్ చేస్తున్నట్లు గమనించిన యజమాని అతన్ని ప్రశ్నించేందుకు ప్రయత్నించగా.. కుర్రాడు పారిపోతాడు. అయితే దీనిపై సదరు కార్ ఓనర్ ఫాస్టాగ్ స్కామ్ జరుగుతున్నట్లు చెప్పడం వైరల్ అవుతున్న వీడియోలో ఉంది.

ఇంటర్నెట్ లో తెగవైరల్ అవుతున్న వీడియోపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. వైరల్ అవుతున్న వీడియో ఫేక్ గా తేల్చింది. ఎన్ఈటీసీ ఫాస్టాగ్ ఎకో సిస్టమ్ అనేది ఎన్ పీసీఐ, అక్వైరర్ బ్యాంక్, ఇష్యూ బ్యాంక్, టోల్ ప్లాజా ఈ నాలుగింటి మధ్య లావాదేవీల కోసమే నిర్మించారని.. లావాదేవీలకు ఎండ్ టూ ఎండ్ భద్రతా ప్రోటోకాల్ ఉందని తెలిపింది. ఫాస్టాగ్ పర్సన్ టూ మర్చంట్ లావాదేవీల కోసమే పని చేస్తుందని వెల్లడించింది. దీనిపై పేటీఎం కూడా స్పందించింది. వీడియో చూపించినట్లు డిజిటల్ వాచ్ ద్వారా స్కాన్ చేసి పేటీఎం నుంచి డబ్బులు కొట్టేయడం సాధ్యపడదని.. ఈ వీడియో ఫేక్ అని వివరణ ఇచ్చింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)