Jharkhand Elections 2024: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు,ఓటేసిన ప్రముఖులు..తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ
ఉదయం 11 గంటల వరకు 29.31 శాతం పోలింగ్ నమోదు కాగా జార్ఖండ్ తొలి విడత ఎన్నికలతో పాటు 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాంచీ పోలింగ్ కేంద్రంలో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పన సోరెన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బర్హైత్ స్థానం నుంచి హేమంత్ సోరెన్, గాండే నియోజకవర్గం నుంచి కల్పన పోటీ చేస్తున్నారు. రాంచీలో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్.
జార్ఖండ్ తొలి విడత ఎన్నికల సమరం ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 29.31 శాతం పోలింగ్ నమోదు కాగా జార్ఖండ్ తొలి విడత ఎన్నికలతో పాటు 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.
రాంచీ పోలింగ్ కేంద్రంలో ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పన సోరెన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బర్హైత్ స్థానం నుంచి హేమంత్ సోరెన్, గాండే నియోజకవర్గం నుంచి కల్పన పోటీ చేస్తున్నారు. రాంచీలో పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్.
మధ్యప్రదేశ్లో జరగుతున్న అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. జార్ఖండ్‌లో నవంబర్ 20న రెండో దశ ఎన్నికలు జరగనుండగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగనుంది. కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము మోసపోయాం.. మీరు మోసపోకండి..మహారాష్ట్రలో ముఖ్రా(కె) గ్రామస్తుల ఎన్నికల ప్రచారం, ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్న గ్రామస్తులు
Here's Tweet: