Joe Root: రికార్డులను తిరగరాస్తున్న జో రూట్, ఇంగ్లండ్ త‌ర‌ఫున అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన రెండో బ్యాట‌ర్‌గా రికార్డు, టెస్టు కెరీర్‌లో 33వ సెంచ‌రీ నమోదు

త‌న‌కెంతో ఇష్ట‌మైన లార్డ్స్ స్టేడియంలో శ్రీ‌లంక(Srilanka) బౌల‌ర్ల‌ను ఉతికేస్తూ 33వ సెంచ‌రీ న‌మోదు చేశాడు. త‌ద్వారా ఇంగ్లండ్ త‌ర‌ఫున అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన రెండో బ్యాట‌ర్‌గా రూట్ రికార్డు నెల‌కొల్పాడు. మాజీ కెప్టెన్ అలిస్ట‌ర్ కుక్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును స‌మం చేశాడు.

Joe Root (Photo credit: X @ICC)

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) మరోసారి శతకంతో మెరిసాడు. త‌న‌కెంతో ఇష్ట‌మైన లార్డ్స్ స్టేడియంలో శ్రీ‌లంక(Srilanka) బౌల‌ర్ల‌ను ఉతికేస్తూ 33వ సెంచ‌రీ న‌మోదు చేశాడు. త‌ద్వారా ఇంగ్లండ్ త‌ర‌ఫున అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన రెండో బ్యాట‌ర్‌గా రూట్ రికార్డు నెల‌కొల్పాడు. మాజీ కెప్టెన్ అలిస్ట‌ర్ కుక్ పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును స‌మం చేశాడు. రూట్ డ్రింక్స్ బ్రేక్ స‌మ‌యానికి రూట్ 128 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. శ్రీ‌లంక‌తో సొంత‌గ‌డ్డ‌పై జ‌రుగున‌త్న రెండో టెస్టు తొలి రోజే అత‌డు మూడంకెల స్కోర్ బాదేశాడు. ల‌హిరు కుమార బౌలింగ్‌లో బౌండరీతో రూట్ టెస్టు కెరీర్‌లో 33వ సెంచ‌రీ నమోదు చేశాడు. దాంతో, 32 సెంచ‌రీల‌తో ఉన్న‌ స్టీవ్ స్మిత్(Steve Smith), కేన్ విలియ‌మ్స‌న్‌(Kane Williamson)ల‌ను రూట్ దాటేశాడు. ఐసీసీ టెస్టు ర్యాంకులు విడుదల, అగ్రస్థానంలో కొనసాగుతున్న జో రూట్, 6, 7, 8 ర్యాంకుల్లో కొన‌సాగుతున్న టీమిండియా ప్లేయర్లు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)