Mamata Banerjee Accident: రోడ్డు ప్రమాదంలో సీఎం మమతా బెనర్జీ తలకు గాయం, ప్రస్తుతం నిలకడగా దీదీ ఆరోగ్యం

రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయపడ్డారు. తన పర్యటనలో భాగంగా బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆమె కారులో ప్రయాణించాల్సి వచ్చింది.

West Bengal CM Mamata Banerjee (Photo Credits: Facebook)

రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయపడ్డారు. తన పర్యటనలో భాగంగా బర్ధమాన్ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఆమె కారులో ప్రయాణించాల్సి వచ్చింది. ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కి ఎదురుగా అకస్మాత్తుగా మరో కారు రావడం.. డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. దీదీ తలకు స్వల్ప గాయాలు కాగా.. ఆమెను కోల్‌కతాకు తీసుకువస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement