Moradabad Shocker: షాకింగ్ వీడియో ఇదిగో.. బుర్ఖా వేసుకున్న మహిళపై దారుణం.. అక్కడ గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించిన కామాంధుడు, నిందితుడు అరెస్ట్..
Moradabad Shocker: రోడ్డుపై వెళ్తున్న ఒక మహిళ పట్ల అకృత్యానికి పాల్పడిన నిందితుడిని మొరాదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా, కట్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రహ్మత్‌నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వైరల్ వీడియో ప్రకారం రహ్మత్‌నగర్‌లోని ఒక వీధిలో.. బాధితురాలి సమీపంలో నిందితుడు కాసేపు అటూ ఇటూ తిరిగాడు. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆమె వద్దకు వెళ్లి వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో భయపడిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమవ్వడమే కాకుండా.. సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్‌గా మారాయి.
వీడియో ఆన్‌లైన్‌లో వెలుగులోకి రాగానే మొరాదాబాద్ జిల్లా పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని పలు సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితుడిని గుర్తించారు.ఈ ఘటనపై సంబంధిత తీవ్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు.. అలాగే నిందితుడిని అరెస్టు చేసినట్లు మొరాదాబాద్ పోలీసులు తమ అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. నిందితుడిపై తదుపరి చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
Man Arrested After CCTV Video Captures Him Groping Burqa-Clad Woman