Rahul Gandhi Party Video: వైరల్ అవుతున్న రాహుల్ గాంధీ నైట్‌ క్లబ్‌ వీడియో, విమర్శలు ఎక్కుపెట్టిన బీజేపీ పార్టీ, వీడియోపై ఇంకా స్పందించని కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీకి సంబంధించిన నైట్‌క్లబ్‌ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. నేపాల్‌ రాజధాని ఖాట్మాండులోని ఓ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌ గాంధీ కనిపించడం వీడియోలో కనిపిస్తోంది.

Rahul Gandhi Party Video

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీకి సంబంధించిన నైట్‌క్లబ్‌ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. నేపాల్‌ రాజధాని ఖాట్మాండులోని ఓ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌ గాంధీ కనిపించడం వీడియోలో కనిపిస్తోంది. బీజేపీ ఐటీ ఇన్‌చార్జి అమిత్‌ మాలవియాతో పాటు పలువురు నేతలు ఈ వీడియోను బేస్ చేసుకుని కాంగ్రెస్‌ నేతపై, ఆ పార్టీ విధానాలపై దుమ్మెత్తిపోస్తున్నారు.

అయితే తన జర్నలిస్ట్‌ ఫ్రెండ్‌ అయిన సుమ్నీమా ఉదాస్‌ వివాహ వేడుక కోసం నిన్న(సోమవారం) రాహుల్‌ గాంధీ ఖాట్మాండు వెళ్లారు. అక్కడ స్నేహితులతో కలిసి ఖాట్మాండ్‌లోని మారియట్‌ హోటల్‌లో బస చేశాడు. ఈ విషయాన్ని సుమ్నీమా తండ్రి భూమ్‌ ఉదాస్‌ ధృవీకరించారు. భూమ్‌ ఉదాస్‌.. మయన్మార్‌లో నేపాల్‌ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ వివాహ వేడుక తరుణంలోనే ఆయన నైట్‌ పార్టీకి హాజరై ఉండొచ్చని అంచనా. దుమారం రేపుతున్న వీడియోలో.. రాహుల్‌ గాంధీ ఓ మహిళతో క్లోజ్‌గా మరింత చర్చనీయాంశంగా మారింది. ఆమె నేపాల్‌లో చైనా దౌత్యవేత్త అయిన హౌ యాంకీ అని, గతంలో నేపాల్‌ ప్రధానిపైనా హనీ ట్రాప్‌ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ తరుణంలో సదరు వీడియోపై మరింత స్పష్టత, కాంగ్రెస్‌ నుంచి వివరణ రావాల్సి ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now