Kishtwar Road Accident: ఘోర ప్రమాదం, జమ్మూ లోయలో పడిన క్రూజర్ వాహనం, ఏడు మంది అక్కడికక్కడే మృతి, పలువురికి గాయాలు
కార్మికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుమంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
జమ్మూ కశ్మీర్‌లో (Jammu and Kashmir)ని కిష్త్వార్ (Kishtwar)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) చోటు చేసుకుంది. కార్మికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుమంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. డంగుదురు పవర్ ప్రాజెక్ట్ (Dangduru Power Project)కు చెందిన 10 మంది కార్మికులు క్రూజర్ వాహనంలో వెళ్తున్నారు. డంగుదురు డ్యామ్ సైట్ (Dangduru Dam site) సమీపంలోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కిష్త్వార్‌లో లోతైన లోయలోకి బోల్తాపడింది. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) సమీపంలోని కేరి సెక్టార్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ANI Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)