Sudden Death Caught on Camera: వీధిలో నడుస్తూ గుండె పట్టుకుని కుప్పకూలిన బాటసారి, షాకింగ్ సీసీ పుటేజీ వీడియో ఇదిగో..

అక్కడ రోడ్డు వెంబడి 35 ఏళ్ల వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే నడుచుకుంటూ వెళుతుండగా ఒక్కసారిగా ఛాతీపై చేతులు పెట్టుకుని రోడ్డుపై పడిపోయాడు. అది చూసి కొద్ది మంది అటుగా వెళ్లారు.

35-Year-Old Man Suddenly Collapses, Dies on Spot in UP's Firozabad

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. అక్కడ రోడ్డు వెంబడి 35 ఏళ్ల వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయితే నడుచుకుంటూ వెళుతుండగా ఒక్కసారిగా ఛాతీపై చేతులు పెట్టుకుని రోడ్డుపై పడిపోయాడు. అది చూసి కొద్ది మంది అటుగా వెళ్లారు. కొద్దిసేపటికే అతను అక్కడే మృతి చెందాడు. ఈ షాకింగ్ మరణం స్థానిక దుకాణంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలో చిక్కుకుంది. మృతుడి పేరు సునీల్ శర్మ. వయస్సు 35. హార్ట్ ఎటాక్ లైవ్ వీడియో ఇదిగో, ఆటో నడుపుతూ గుండెపోటుతో కుప్పకూలి రోడ్డు మీద పడిపోయిన డ్రైవర్

రోడ్డుపైనే అస్వస్థతకు గురైనా ఎవరూ సాయం చేయలేదు. ఆయన చనిపోయిన తర్వాత జనం మెల్లగా అక్కడికి చేరుకోవడం ప్రారంభించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి విచారణ ప్రారంభించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రాథమిక అంచనా. ఆయన శారీరకంగా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)