Tamil Nadu: షాకింగ్ వీడియో.. అందరి ముందే బీజేపీ మహిళా నేతపై ఆ పార్టీ నేత లైంగిక వేధింపులు, నడుం దగ్గర చీర లాగుతూ కెమెరాకు చిక్కని తమిళనాడు బీజేపీ నేత
ఈ వీడియోలో బీజేపీ నేత శశికళా పుష్పను ఓ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్ బాలగణపతి లైంగిక వేధింపులకు గురిచేసినట్లుగా తెలుస్తోంది. పొన్ బాలగణపతి శశికళ పుష్ప చీరను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆమె తోసివేసినట్టు కనిపించింది.
తమిళనాడులో కాషాయ నేతల లైంగిక వేధింపుల వీడియో బయటకు వచ్చింది. డీఎంకే ఐటీ విభాగం రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి ఇసై దక్షిణామూర్తి ఈ వీడియోను సోషల్ మీడయిాలో షేర్ చేశారు. ఈ వీడియోలో బీజేపీ నేత శశికళా పుష్పను ఓ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్ బాలగణపతి లైంగిక వేధింపులకు గురిచేసినట్లుగా తెలుస్తోంది. పొన్ బాలగణపతి శశికళ పుష్ప చీరను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆమె తోసివేసినట్టు కనిపించింది. ఆపై పొన్ బాలగణపతి ఆమె ఎడమ చేతిని తాకేందుకు ప్రయత్నించాడు.
బీజేపీలో చేరిన మహిళలు ఆ పార్టీ నేతల నుంచి తమను తాము కాపాడుకోవడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోందా అనే క్యాప్షన్‌తో డీఎంకే నేత ఈ వీడియోను షేర్ చేశారు. రామనాధపురం జిల్లాలో దళిత నేత ఇమ్మానుయేల్ శేఖరన్ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమానికి శశికళ పుష్ప హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోపై పొన్ బాలగణపతి ఇంతవరకూ స్పందించలేదు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)