Uttar Pradesh Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటో రిక్షాను ఢీకొట్టిన వాహనం, 10 మంది అక్కడికక్కడే మృతి, మరో ఏడు మందికి గాయాలు

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో రిక్షాను ఎదురుగా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలవగా.. మరో ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది.

Accident Representative image (Image: File Pic)

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో రిక్షాను ఎదురుగా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలవగా.. మరో ఏడు మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం మౌదాహ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన ఆయన.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతులు ఇమిలియా, ఇంగోటా వాసులుగా తెలుస్తున్నది.

Uttar Pradesh Road Accident: 10 Killed, 7 Injured After Vehicle Carrying Pilgrims From Haridwar Falls Into Roadside Ditch in Gajraula #UttarPradesh #Gajraula #Accident #Haridwar https://t.co/mrFu83TMPk

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement