Uttar Pradesh Shocker: వీడియో ఇదిగో, మహిళ ఇంట్లో ఒంటరిగా ఉందని రేప్ చేయబోయిన ఎస్సై, పట్టుకుని బట్టలు ఊడదీసి స్తంభానికి కట్టేసి చితకబాదిన స్థానికులు

అతడి దుస్తులు తొలగించి, స్తంభానికి కట్టేసి కొట్టారు.గ్రామస్థులు ఈ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వ్యవహారం వైరల్‌గా మారింది.

Cop Stripped Beaten by Villagers After Being Caught in Compromising Position in Agra

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఓ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండగా లోపలికి ప్రవేశించి ఆమెను వేధించేందుకు ప్రయత్నించాడని ఆరోపిస్తూ గ్రామస్థులు ఓ ఎస్సైని పట్టుకుని చితకబాదారు. అతడి దుస్తులు తొలగించి, స్తంభానికి కట్టేసి కొట్టారు.గ్రామస్థులు ఈ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వ్యవహారం వైరల్‌గా మారింది. విషయం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఎస్సై సందీప్ కుమార్‌ను తక్షణం సస్పెండ్ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

మరోవైపు, తనపై అత్యాచారానికి యత్నించాడంటూ మహిళ ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదైంది. సందీప్ కుమార్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. దర్యాప్తు కోసం వెళ్లిన తనపై గ్రామస్థులే దాడి చేశారని ఆరోపించారు. సందీప్ రెండు సంవత్సరాల క్రితం పోలీసు శాఖలో జాయిన్ అయ్యారు.

Cop Stripped Beaten by Villagers After Being Caught in Compromising Position in Agra

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు