Video: మేనకోడలి పెళ్లిలో డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన మామ, ఆస్పత్రికి తీసుకువెళ్లేలోగా తిరిగిరాని లోకాలకు, రాజస్థాన్‌లో విషాద ఘటన
ఓ వ్యక్తి పెళ్లి వేడుకలో హుషారుగా డ్యాన్స్ చేస్తూ.. అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. ఈ విషాద ఘటన రాజస్తాన్‌లోని పాలిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఓ వ్యక్తి పెళ్లి వేడుకలో హుషారుగా డ్యాన్స్ చేస్తూ.. అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. ఈ విషాద ఘటన రాజస్తాన్‌లోని పాలిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పాలిలోని రణవాస్ స్టేషన్‌లో నివసిస్తున్న 42 ఏళ్ల అబ్దుల్ సలీం పఠాన్ ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. అబ్దుల్ తన భార్య, ఇద్దరు పిల్లలు తన అత్తమామలతో కలిసి మేనకోడలి వివాహ వేడెక్కి హాజరయ్యాడు. శనివారం అబ్దుల్ మేనకోడలి వివాహం జరగాల్సి ఉంది. పెళ్లికి ఒక రోజు ముందు.. అబ్దుల్ మ్యూజిక్ నైట్ వేదికపై డ్యాన్స్ చేస్తున్నాడు. అయితే డ్యాన్స్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా కింద పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా గుండెపోటుతో మరణించాడని డాక్టర్లు తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)