Viral Video: వీడియో ఇదిగో, మద్యం అక్రమంగా తరలిస్తున్న కారుకు ప్రమాదం, బాటిళ్లు బయటకు రావడంతో వాటిని తీసుకుని జనం పరార్
దొరికింది దొరికినట్టు తీసుకుని పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అక్టోబరు 30న బిహార్‌లోని జాతీయ రహదారి- 2పై ఈ ఘటన చోటు చేసుకుంది.
People Looting Liquor Bottles from a Car: మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తున్న కారు రోడ్డు ప్రమాదంకు గురైంది.దీంతో మద్యం బాటిళ్లను దక్కించుకునేందుకు జనం ఎగబడ్డారు. దొరికింది దొరికినట్టు తీసుకుని పరారయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అక్టోబరు 30న బిహార్‌లోని జాతీయ రహదారి- 2పై ఈ ఘటన చోటు చేసుకుంది.
రాష్ట్రంలో 2016, ఏప్రిల్ 5 నుంచి మద్య నిషేధం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ మద్యం అక్రమ రవాణాకు తెరతీసింది. మెడిసిన్ పేరుతో విదేశీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. మితిమీరిన వేగంతో ఉన్న ఈ వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో సాయం చేసేందుకు వచ్చిన స్థానికులు కారులో ఉన్న దాన్ని చూసి షాకయ్యారు. అంతే ఒక్కసారిగా అక్కడ గలాటా మొదలైంది. మద్యం బాటిళ్లను దొరకబుచ్చుకుని పరుగు అందున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)