Viral Video: వీడియో ఇదిగో, ట్రాఫిక్ జామ్ నుంచి తప్పించుకునేందుకు చంద్రానదిలోకి కారును పోనిచ్చిన డ్రైవర్, తర్వాత ఏమైందంటే..
ఓ వ్యక్తి ట్రాఫిక్ జంఝాటం నుంచి తప్పించుకునేందుకు ఏకంగా నదిలోకి కారును పోనిచ్చాడు.లాహుల్ వ్యాలీలోని చంద్రానదిలో మహీంద్రా థార్ ఎస్‌యూవీ ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది
Tourist Drives Mahindra Thar SUV Through River To Beat Traffic Jam: హిమాచల్ ప్రదేశ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ట్రాఫిక్ జంఝాటం నుంచి తప్పించుకునేందుకు ఏకంగా నదిలోకి కారును పోనిచ్చాడు.లాహుల్ వ్యాలీలోని చంద్రానదిలో మహీంద్రా థార్ ఎస్‌యూవీ ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఘటన సమయంలో నదిలో నీరుపెద్దగా లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే, డ్రైవర్ నిర్లక్ష్య పూరిత వైఖరిపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, ఈ వీడియో పోలీసుల దృష్టికి కూడా వెళ్లడంతో నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ చేసినందుకు సదరు డ్రైవర్‌పై మోటార్ వాహనాల చట్టం-1988 కింద కేసు నమోదైంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)