
Vjy, Feb 26: మహాశివరాత్రి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి గల్లంతైన ఐదుగురు యువకులు మృతిచెందారు. పండుగ వేళ తెల్లవారుజామున 11 మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారిలో ఐదుగురు యువకులు నీటిలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఆ ఐదుగురూ గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.
గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు..తూర్పుగోదావరి జిల్లాలో ఘటన, శివరాత్రి రోజే విషాదం, వీడియో ఇదిగో
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. మృతులు టి.పవన్ (17), పి. దుర్గాప్రసాద్ (19), పి.సాయి కృష్ణ (19), ఎ. పవన్ (19), జి.ఆకాశ్ (19)గా గుర్తించారు. వీరంతా కొవ్వూరు, తాళ్లపూడి, రాజమహేంద్రవరంలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు. యువకులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో విషాదఛాయలు అలముకున్నాయి.
5 youths dies Who drown in Godavari river during Maha Shivratri bath
తాడిపూడిలో గల్లంతైన ఐదుగురు యువకుల మృతి
తూర్పు గోదావరి జిల్లా తాడిపూడిలో గల్లంతైన ఐదుగురు యువకులు మృతిచెందారు.
మహాశివరాత్రి సందర్భంగా ఈ ఉదయం 11 మంది యువకులు గోదావరిలో స్నానానికి దిగగా ఐదుగురు యువకులు అనిశెట్టి పవన్(19), గర్రె ఆకాశ్ (19), తిరుమలశెట్టి పవన్ (17), పడాల… pic.twitter.com/wsnOKGNAmJ
— Aadya TV (@AadyaTv_) February 26, 2025
తూర్పు గోదావరి జిల్లా, తాడిపూడిలో గల్లంతైన 5 గురు మృతి. https://t.co/voXWnzYp7R pic.twitter.com/3P8NdPterW
— ChotaNews App (@ChotaNewsApp) February 26, 2025
సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్, జిల్లా కలెక్టర్ ప్రశాంతి, కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వర్, కొవ్వూరు ఆర్డీవో రాణి సుష్మిత పరిశీలించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. మృతుల కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, పరిహారం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు కలెక్టర్ తెలిపారు.