గోదావరి నదిలో (Godavari River)ఐదుగురు యువకులు గల్లంతు అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు(Five Youngsters Missing). ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బంధువుల రోధనలతో స్థానికంగా విషాదం నెలకొంది.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం.. రైస్ మిల్ లోకి చొరబడ్డ ఏనుగుల గుంపు (వీడియో)
ఇక మరో ఘటనలో ఏపీలోని పలు జిల్లాల్లో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ ఏనుగుల గుంపు జియ్యమ్మవలస మండలం పెదమేరంగిలోని సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ లోకి చొరబడింది. మిల్లులో భద్రపరిచిన ధాన్యం, బియ్యం నిల్వలను చెల్లాచెదురు చేశాయి. ఏనుగుల దాడిలో సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.
Five Youngsters Missing in Godavari River
గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు..
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో స్నానానికి దిగిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. ఈతగాళ్ల సాయంతో యువకుల కోసం… pic.twitter.com/NpBbQAbZdj
— ChotaNews App (@ChotaNewsApp) February 26, 2025
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)