హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో సరదాగా టూరుకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ అనన్యరావు (27) మృతి చెందారు. తుంగభద్రలో దూకి ఈత కొట్టే క్రమంలో నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్‌ అనన్యరావు, మరో ఇద్దరు స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్‌కి వచ్చారు. స్మారకాలను వీక్షించి మంగళవారం రాత్రి సణాపుర గ్రామంలోని ఓ అతిథి గృహంలో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం ఈత కొట్టడానికి తుంగభద్ర నది వద్దకు వెళ్లారు. అనంతరం, ఈత కొట్టేందుకు సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్యరావు నీటిలో దూకింది.

షాకింగ్ వీడియో ఇదిగో, 270 కిలోల బార్‌బెల్ మెడపై పడి వెయిట్ లిఫ్టర్ మృతి, బరువు ఎత్తుతుండగా జారి పడటంతో బంగారు పతక విజేత యష్టిక ఆచార్య మరణం

కాసేపు ఈత కొట్టిన అనన్య ఆ నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో అనన్య కాపాడేందుకు స్నేహితులు ప్రయత్నించినా వారి ప్రయత్నం ఫలించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో గంగావతి గ్రామీణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక గజ ఈతగాళ్లు, అగ్నిమాపకదళం సాయంత్రం వరకు ప్రయత్నించినా ఆమె జాడ కనిపించలేదు. తాజాగా గురువారం ఉదయం అనన్యరావు మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో, అనన్య కుటుంబ సభ్యులు, స్నేహితులు బోరున విలపిస్తున్నారు. అనన్యరావు తండ్రి డా.మెహన్‌రావు అని, ఆమె వీకేసీ ఆస్పత్రిలో వైద్యురాలని తెలిసింది.

Hyderabad doctor jumps into Tungabhadra river

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)