West Bengal Horror: దారుణం, భార్య తలను నరికి బస్టాప్‌లో తెగిన తలతో కూర్చున్న భర్త, రక్తంతో తడిసి ఉన్న అతన్ని చూసి భయంతో వణికిపోయిన స్థానికులు

పశ్చిమ బెంగాల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను నరికి చంపి ఆ తెగిన తలతో రోడ్డుపై తిరిగాడు.బస్టాప్‌ వద్ద ఉన్న తెగిపడిన తలతో ఉన్న అతడ్ని చూసి స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్‌ మిడ్నాపూర్‌లో ఈ సంఘటన జరగగా పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు

Murder (Photo Credits: Pixabay)

పశ్చిమ బెంగాల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి తన భార్యను నరికి చంపి ఆ తెగిన తలతో రోడ్డుపై తిరిగాడు.బస్టాప్‌ వద్ద ఉన్న తెగిపడిన తలతో ఉన్న అతడ్ని చూసి స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని ఈస్ట్‌ మిడ్నాపూర్‌లో ఈ సంఘటన జరగగా పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 ఏళ్ల గౌతమ్‌ గుచ్చైత్ తన భార్యతో గొడవపడి ఆగ్రహంతో పదునైన ఆయధంతో ఆమె తల నరికి చంపాడు. తెగిన తలను చేతిలో పట్టుకుని చిస్తీపూర్ బస్టాప్ వద్దకు చేరుకున్నాడు.

అక్కడ ఒక చోట ఉన్న బల్లపై తెగిన భార్య తల ఉంచి కూర్చొన్నాడు.ఆ వ్యక్తిని చూసి స్థానికులు భయాందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే అక్కడకు చేరుకుని గౌతమ్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేన్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Here's TOI News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement