2024 భారతదేశం ఎన్నికలు: రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లను కోరిన ప్రధాని మోదీ, కొత్త ఓటర్లు తప్పనిసరిగా ఓటు వేయాలని పిలుపు

దేశంలో సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections 2024) శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఇవాళ తొలి విడత పోలింగ్‌ (Polling) జరుగుతోంది.ఈ సందర్భంగా యువకులు, తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకునే వారు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కోరారు.

PM Modi in BJP Vijaya Sankalpa Sabha (photo-Video Grab)

2024 భారతదేశం ఎన్నికలు: దేశంలో సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Elections 2024) శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఇవాళ తొలి విడత పోలింగ్‌ (Polling) జరుగుతోంది.ఈ సందర్భంగా యువకులు, తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకునే వారు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కోరారు. ‘2024 లోక్‌సభ ఎన్నికలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తొలివిడతలో భాగంగా వివిధ స్థానాల్లో ఓటు వేసే వారందరూ తమ ఓటు హక్కును రికార్డు సంఖ్యలో వినియోగించుకోవాలి. ముఖ్యంగా యువకులు, మొదటిసారి ఓటర్లు తప్పక ఓటు వేయాలి’’ అని మోదీ ట్విటర్ వేదికగా పిలుపునిచ్చారు.  గత పదేళ్ళ గాయానికి మీ ఓటుతో చికిత్స చేయండి, మీ శక్తిమంతమైన ఓటుతో ద్వేషాన్ని ఓడించి ప్రేమ దుకాణాలు తెరవాలని పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ

మొదటి దశ ఎన్నికలకు వెళ్తున్న 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో.. తమిళనాడులో 39 స్థానాలు, రాజస్థాన్‌లో 12, ఉత్తరప్రదేశ్ లో 8, మధ్యప్రదేశ్ లో 6, అసోం, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఐదేసి స్థానాలు, బీహార్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 3, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో రెండేసీ స్థానాలు, ఛత్తీస్ గడ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతుంది.

Here's Modi Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement