Chandra Grahanam: నేడే చంద్రగ్రహణం...ఎన్ని గంటలకు ప్రారంభం, ఎప్పటి వరకూ గ్రహణం కనిపిస్తుంది..పూర్తి వివరాలు మీ కోసం..
మొత్తం ఒక గంట 19 నిమిషాల పాటు గ్రహణం సమయం కొనసాగుతుంది.
చంద్ర గ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నిమిషాలకు గ్రహణం ప్రారంభమై, గ్రహణ మోక్ష కాలం తెల్లవారుజామున 2.23 గంటలకు ఉంటుంది. మొత్తం ఒక గంట 19 నిమిషాల పాటు గ్రహణం సమయం కొనసాగుతుంది. కానీ సనాతన ధర్మం ప్రకారం సాయంత్రం 4 గంటల నుంచే సూతక కాలం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గ్రహణం నేడే ప్రారంభమై రేపటితో ముగుస్తుంది. భారత్‌తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చంద్ర గ్రహణం కనిపించనుంది. ఈ గ్రహణం ఆఫ్రికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలోని తూర్పు, ఉత్తర ప్రాంతాలు, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పశ్చిమ, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో కనిపించనుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)