Aligarh Shocker: దారుణం, ఆస్తి కోసం కన్నతల్లికి నిప్పంటించిన కొడుకు, అది పోలీస్ స్టేషన్ లోపలే.., వీడియో సోషల్ మీడియాలో వైరల్

అలీగఢ్‌లో ఆస్తి తగాదాల నేపథ్యంలో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఒక వ్యక్తి అక్కడ తన తల్లికి (Man Sets Mother On Fire) నిప్పంటించాడు. షాకైన పోలీసులు మంటలు ఆర్చి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్రంగా కాలిన గాయాలైన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

Son Sets Mother on Fire at Police Station Over Property Dispute, Disturbing Video Surfaces

యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అలీగఢ్‌లో ఆస్తి తగాదాల నేపథ్యంలో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఒక వ్యక్తి అక్కడ తన తల్లికి (Man Sets Mother On Fire) నిప్పంటించాడు. షాకైన పోలీసులు మంటలు ఆర్చి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్రంగా కాలిన గాయాలైన ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడిన పోలీస్ కానిస్టేబుల్.. మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఘటన

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భూమి వివాదం నేపథ్యంలో ఒక కుటుంబం ఖైర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. ఒక మహిళ, ఆమె కొడుకు ఒక పక్కకు వెళ్లారు. ఆ మహిళ తన ఒంటిపై పెట్రోల్‌ పోసుకుంది. లైటర్‌తో నిప్పంటించుకుంటానని బెదిరించింది. కాగా, పోలీసులు ఆ మహిళ ప్రయత్నాన్ని అడ్డుకుకున్నారు. అయితే మొబైల్‌ ఫోన్‌లో వీడియో రికార్డ్‌ చేస్తున్న మహిళ కుమారుడు ఆ లైటర్‌తో తన తల్లికి నిప్పంటించాడు. మంటల్లో ఆమె కాలుతుండటాన్ని మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేశాడు.తల్లికి నిప్పంటించిన 22 ఏళ్ల కుమారుడు గౌరవ్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)