Tirupati: వీడియో ఇదిగో, తిరుపతిలో తీవ్ర అపచారం, క్రిస్మస్ పండుగ ముందు రోజు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీని పెట్టిన దుండగులు, మండిపడుతున్న హిందూ సంఘాలు
క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీని పెట్టారు దుండగులు. అన్నమయ్యను అవమానమీయంగా శాంట క్లాస్ టోపీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండించాయి హిందూ సంఘాలు
తిరుపతిలో తీవ్ర అపచారం ఘటన చోటు చేసుకుంది. క్రిస్మస్ పండుగ ముందు రోజు తిరుపతిలో తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీని పెట్టారు దుండగులు. అన్నమయ్యను అవమానమీయంగా శాంట క్లాస్ టోపీ పెట్టడాన్ని తీవ్రంగా ఖండించాయి హిందూ సంఘాలు, భజరగ్దళ్ సంస్థలు. శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రియ భక్తుడు, పదకవితా పితామహుడిని కించ పరిచేలా వ్యవహరించిన దుండగులు వ్యవహరించారని మండిపడ్డారు.
క్రైస్తవుల అత్యుత్సాహం పనికిరాదని హిందూ సంఘాల ఆందోళనతో కూడిన హెచ్చరిక జారీ చేశాయి. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షించాలని డిమాండ్. చేశారు. పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి హిందూ సంఘాలు.
Thugs put Santa Claus hat on Tallapaka Annamacharya statue
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)