Hyderabad Shocker: ఫ్లైఓవర్ పైనుంచి కిందనున్న మరో ఫ్లైఓవర్ పైపడి యువకుడి మృతి.. బైక్‌ పై వేగంగా వెళుతూ డివైడర్‌ను ఢీకొట్టిన యువకుడు.. ఘటనాస్థలంలోనే మృతి, వెనక కూర్చున్న వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స.. ఆదివారం రాత్రి గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. వీడియోతో..

హైదరాబాద్ లోని గచ్చిబౌలీలో ఘోరం జరిగింది. ఫ్లైఓవర్‌ పైనుంచి కిందనున్న మరో ఫ్లైఓవర్ పైపడి ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.

Credits: Twitter

Hyderabad, July 24: హైదరాబాద్ (Hyderabad) లోని గచ్చిబౌలీలో (Gachibowli) ఘోరం జరిగింది. ఫ్లైఓవర్‌ (Flyover) పైనుంచి కిందనున్న మరో ఫ్లైఓవర్ పైపడి ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన  ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రాత్రి వేళ ఇద్దరు యువకులు వేగంగా బైక్ పై (Bike) ప్రయాణిస్తూ డివైడర్‌ ను ఢీకొట్టారు. దీంతో, ఒక ఫ్లైఓవర్ నుంచి మరో ఫ్లైవర్‌పై ఎగిరిపడ్డారు. ప్రమాద తీవ్రతకు మధు(25) అనే యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరో యువకుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సిద్ధిపేటకు చెందిన మధు గచ్చిబౌలిలో నివసిస్తుంటాడని పోలీసులు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు.

Shocking Incident in Kakinada: హమ్మో! కుక్క కరిచిన ఆరు నెలలకు రేబీస్.. బాలుడి దుర్మరణం.. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో వెలుగు చూసిన ఘటన.. కుక్క కరిచినా భయపడి ఇంట్లో చెప్పని బాలుడు.. అందుకే, ఇలా!!

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement