Fire Accident At Prayagraj: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. భక్తుల గుడరాల్లో పెద్ద ఎత్తున మంటలు, పరుగులు తీసిన భక్తులు, వీడియో ఇదిగో
మహా కుంభమేళా 2025కి భక్తులు పోటెత్తారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో భక్తులు స్నానాలు ఆచరించగా తాజాగా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‍రాజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
మహా కుంభమేళా 2025కి భక్తులు పోటెత్తారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో భక్తులు స్నానాలు ఆచరించగా తాజాగా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‍రాజ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భక్తుల గుడారాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో శిబిరాల నుంచి బయటకు భక్తులు పరుగులు తీశారు. వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక యాపిల్ కంపెనీ సహా వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్ అస్వస్తతకు గురయ్యారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ఆమె హాజరు కాగా వాతావరణ మార్పు వల్ల ఆమె అస్వస్థతకు గురైనట్టు నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి కైలాసానంద గిరి మహారాజ్ తెలిపారు. మహా కుంభమేళాకు వచ్చి అస్వస్తతకు గురైన దివంగత స్టీవ్ జాబ్స్ సతీమణి లారీన్ పావెల్ జాబ్స్, ఆరోగ్యం కుదుటపడ్డాక త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని తెలిపిన కైలాసానంద గిరి మహారాజ్
Fire accident at Maha Kumbh mela in Prayagraj
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)