Barrelakka Crying Video: నాకే పాపం తెలియదంటూ ఏడ్చేసిన బర్రెలక్క, ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిందంటూ వార్త వైరల్, వీడియో ఇదిగో..
అందులో బర్రెలక్క కన్నీరు పెట్టుకుంటూ.. తాను ఏ తప్పు చేయలేదని, అతనెవరో కూడా తనకు తెలియదని చెప్పడం వీడియోలో కనిపించింది.
కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క తాలూకు ఓ వీడియో నెట్టింట తాజాగా వైరల్ అవుతోంది. అందులో బర్రెలక్క కన్నీరు పెట్టుకుంటూ.. తాను ఏ తప్పు చేయలేదని, అతనెవరో కూడా తనకు తెలియదని చెప్పడం వీడియోలో కనిపించింది. విషయం ఏంటంటే.. కన్నడకు చెందిన ఓ ప్రముఖ ఛానెల్... బర్రెలక్క తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా ఒక వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని మోసం చేసిందని వార్తలను ప్రసారం చేసింది. ఆ వార్తలలో తన ఫొటోలతో పాటు, పేరు కూడా ప్రస్తావించింది. పైగా బాధితుడు కూడా తనను ఆమె మోసం చేసిందని చెప్పడం గమనార్హం. వీడియో ఇదిగో, ట్రాఫిక్‌లో డబ్బులు విసురుతూ రీల్స్ తీసిన యూట్యూబర్, ఇదేం పిచ్చి అంటూ మండిపడుతున్న నెటిజన్లు
దీనిపై బర్రెలక్క్ వీడియో ద్వారా స్పందించింది. ఇదంతా ఫేక్ అని, ఆ వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదంటూ కన్నీటిపర్యంతమైంది. తాను ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఇన్‌స్టాలో ఓ వీడియోను బర్రెలక్క పోస్ట్ చేసింది.ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న ఛానెల్‌పై ఆమె అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, వారితో మాట్లాడిన ఆడియోను కూడా వినిపించింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)