Viral Video: వీడియో ఇదిగో, వేగంగా వస్తున్న రైలు కింద పడిన నడి వయస్కుడు, అప్పటికప్పుడు తట్టిన సమయస్ఫూర్తితో పట్టాల మధ్యన పడుకోవడంతో సేఫ్
రైలు వచ్చే ముందు పట్టాలపై పడిపోయిన ఓ నడివయస్కుడు తెలివితో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. చిరకల్-కన్నూరు రైల్వే స్టేషన్ మధ్య పన్నెన్‌పరా వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
రైలు వచ్చే ముందు పట్టాలపై పడిపోయిన ఓ నడివయస్కుడు తెలివితో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. చిరకల్-కన్నూరు రైల్వే స్టేషన్ మధ్య పన్నెన్‌పరా వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.రైలు వెళుతుండగా ట్రాక్‌పై పడిన వ్యక్తికి రైలు వస్తుందని పక్కనే ఉన్నవారు చెప్పినా వెంటనే లేవలేకపోయాడు. రైలు అతనిపై నుంచి వెళ్లే సమయంలో నడివయస్కుడు సమయస్ఫూర్తితో పట్టాల మధ్యన పడుకుండి పోయాడు.
రైలు వెళ్లిన తరువాత లేచి ట్రాక్ వెంబడి తాఫీగా నడిచినట్లు ఫుటేజీలో స్పష్టంగా ఉంది.అయితే రైలు పట్టాల కింద ఎవరు పడిపోయారనే విషయాన్ని రైల్వే పోలీసులు నిర్ధారించలేకపోయారు. బాధితుడు మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రైల్వే పోలీసులు పన్నెన్‌పరాలోని సీసీటీవీ ఫుటేజీని సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
Elderly Man Escaping From Train Accident in Kannur