Lady Aghori Attacked Video: వీడియో ఇదిగో, బట్టలు వేసుకొని స్వామి దర్శనానికి రమ్మన్నందుకు కత్తితో పలువురిపై దాడి చేసిన లేడీ అఘోరీ

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద మంగళవారం లేడీ అఘోరీ హల్చల్ చేసింది. చేతిలో కత్తి పట్టుకొని అక్కడున్న వారిపై దాడికి దిగింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ ఘటనతో భయాందోళన చెందారు. శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు లేడీ అఘోరీ మంగళవారం ఆలయం వద్దకు వచ్చింది.

Lady Aghori Attacked Video (Photo-X/Chota news)

సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద మంగళవారం లేడీ అఘోరీ హల్చల్ చేసింది. చేతిలో కత్తి పట్టుకొని అక్కడున్న వారిపై దాడికి దిగింది.  స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ ఘటనతో భయాందోళన చెందారు. శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు లేడీ అఘోరీ మంగళవారం ఆలయం వద్దకు వచ్చింది. అయితే ఆలయ ప్రధాన ద్వారం నుండి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని అఘోరీ పట్టుబట్టగా, దుస్తులు ధరించి రావాలని సిబ్బంది సూచించారు.

వీడియో ఇదిగో, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న లేడీ అఘోరి, ముస్లింలు, క్రైస్తవులు ఈ దేశం వదిలి పారిపోవాలని బెదిరింపులు

తనకే ఎదురు చెబుతారా అంటూ లేడీ అఘోరీ అగ్రహారం వ్యక్తం చేస్తూ.. ఆలయం వద్ద హల్చల్ చేసింది.ఆలయం వెలుపలకి వచ్చి తన వద్ద గల తల్వార్ తీసుకొని స్థానిక భక్తులను భయభ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటనతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆలయం వద్దకు చేరుకొని అఘోరీకి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. స్థానిక భక్తులు కూడ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అఘోరీ నిర్వాకంతో కొందరు భక్తులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

కత్తితో పలువురిపై దాడి చేసిన లేడీ అఘోరీ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement