File: Yadadri (Credits: Telangana Tourisim Dept.)

Yadagirigutta, Mar 7: ఏపీలోని (AP) తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) స్వయం ప్రతిపత్తితో కొనసాగుతున్నది. ఆలయ నిర్వహణకు టీటీడీ పేరిట ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఉంటుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి రానుంది. దీంతో ఆలయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండనుంది. యాదగిరిగుట్ట ఆలయానికి ట్రస్ట్ బోర్డు, పదవీకాలం, నిధులు, ఉద్యోగ నియామకాలు, బదిలీలకు సంబంధించిన సర్వీస్ రూల్స్, ఈవోగా ఏ స్థాయి అధికారి ఉండాలనే వివరాలను మంత్రివర్గంకు నోట్ రూపంలో అందించారు. దేవాదాయ శాఖ చట్టం-1987లోని చాప్టర్ 14 కింద ఈ దేవస్థానాన్ని చేర్చారు. ఈ మేరకు అసెంబ్లీలో చట్టసవరణ చేయనున్నారని సమాచారం. ఈ మేరకు మంత్రి పొంగులేటి మీడియాకు వెల్లడించారు.

కేపీహెచ్‌ బీలో యువతుల హల్‌ చల్‌.. మద్యం మత్తులో కారుతో బీభత్సం.. వీడియో వైరల్

అధికారిక బాధ్యతలు ఇలా..

యాదగిరిగుట్ట దేవస్థానానికి ఈవోగా ఐఏఎస్ అధికారిని, లేదంటే అదనపు కమిషనర్, ఆపై స్థాయి అధికారిని నియమించాలని మంత్రివర్గానికి సమర్పించిన నోట్‌ లో పేర్కొన్నారు. బోర్డుకు చైర్మన్‌తో పాటు 10 మంది సభ్యులను నియమిస్తారు. ఇందులో ఒకరు ఫౌండర్ ట్రస్టీ కాగా, తొమ్మిది మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. టీటీడీ తరహాలోనే ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఉంటారు.

వీడియో ఇదిగో, భార్య వేధింపులు తట్టుకోలేక మరో సాప్ట్‌వేర్ ఆత్మహత్య, పెళ్లయిన ఏడాదికే సూసైడ్, దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడాలని సెల్ఫీ వీడియో