Sheetal Devi's Bullseye Shot: ఆర్చర్ శీతల్ దేవి అదిరిపోయే షాట్ వీడియో ఇదిగో, నీకు కారు గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాను అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్
పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చర్ శీతల్ దేవి తన అద్భుత ప్రతిభతో యావత్ క్రీడా ప్రపంచాన్నీ అబ్బురపర్చింది. 17 ఏళ్ల శీతల్ త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్నప్పటికీ అదిరిపోయే షాట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. శీతల్ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు.
అసాధారణ ధైర్యం, నిబద్ధత, పట్టువదలని స్ఫూర్తి పతకాలతో ముడిపడి ఉండదు అంటూ ట్వీట్ చేశారు.ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్‌గా సుమారు గత ఏడాది మహీంద్ర కారును బహుమతిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘18 ఏళ్లు నిండిన తర్వాత ఆఫర్(కారు బహుతి) స్వీకరిస్తారని చెప్పారు. దీని ప్రకారం వచ్చే ఏడాది కారు మీ చేతికి వస్తుంది. మీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకునేందుకు ఎదురు చూస్తున్నాను’’ అంటూ ఆనంద్ మహీంద్ర పోస్ట్ పెట్టారు .
Here's Viral Shot Video