Rahmat Shah Run Out Video: ఇదేమి రనౌట్ బాబోయ్, అఫ్గన్ బ్యాటర్ రహ్మత్ షా అవుటైన తీరు నెట్టింట వైరల్, వీడియో మీరే చూడండి
అఫ్గనిస్తాన్- సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే సందర్భంగా అఫ్గన్ బ్యాటర్ రహ్మత్ షా అవుటైన తీరు నెట్టింట వైరల్ అవుతోంది. అఫ్గన్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌ను ప్రొటిస్ పేసర్ లుంగి ఎంగిడి వేశాడు.
అఫ్గనిస్తాన్- సౌతాఫ్రికా మధ్య మూడో వన్డే సందర్భంగా అఫ్గన్ బ్యాటర్ రహ్మత్ షా అవుటైన తీరు నెట్టింట వైరల్ అవుతోంది. అఫ్గన్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌ను ప్రొటిస్ పేసర్ లుంగి ఎంగిడి వేశాడు. అప్పుడు రహ్మనుల్లా గుర్బాజ్ క్రీజులో ఉండగా.. రహ్మత్ షా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో ఎంగిడి ఓవర్‌లో ఐదో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు రహ్మనుల్లా.
బంగ్లాపై సెంచరీతో కదం తొక్కిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టులో ఆరో సెంచరీ నమోదు
దీంతో సింగిల్ తీసేందుకు రెడీగా ఉన్న రహ్మత్ అప్పటికే క్రీజు నుంచి బయటకు రాగా.. రహ్మనుల్లా సైతం నాన్ స్ట్రైకర్ ఎండ్‌వైపు పరుగు మొదలుపెట్టాడు. అయితే రహ్మనుల్లా కొట్టిన బంతిని ఆపేందుకు ఎంగిడి చేయి అడ్డం పెట్టాడు. అయితే, బంతి అతడి చేతికి చిక్కకపోయినా.. చేయిని గీసుకుంటూ.. రహ్మత్‌కు తాకి స్టంప్స్‌ను ఎగురగొట్టింది. ఫలితంగా రహ్మత్ రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)