Horrific Accident in Bijnor: షాకింగ్ వీడియో, రీల్స్ చేస్తూ బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టిన కారు, అమాంతం ఎగిరి అవతల పడిన ఇద్దరు యువకులు
బిజ్నోర్‌లోని ఢిల్లీ – పౌరి నేషనల్ హైవేపై ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు రోడ్డు మధ్యలో నుంచి కుడివైపుకు వెళ్లసాగారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు.
ఉత్తరప్రదేశ్ బిజ్నోర్ (Bijnor)లో ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గాల్లో ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ (Viral Video) అవుతోంది. బిజ్నోర్‌లోని ఢిల్లీ – పౌరి నేషనల్ హైవేపై ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు రోడ్డు మధ్యలో నుంచి కుడివైపుకు వెళ్లసాగారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. అటుగా వెళ్తున్న వారు వెంటనే స్పందించి సదరు యువకుల్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. అయితే, రీల్స్ చేస్తూ వారు ప్రమాదానికి గురైనట్లుగా నెటిజన్లు చెప్తున్నారు. కర్నూలు జిల్లాలో టిడిపి నేత దారుణ హత్య, మాజీ సర్పంచ్ భర్త శ్రీనివాసుని హతమార్చిన దుండగులు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)