Viral Video: వీడియో ఇదిగో, చీరలో కాలెత్తి అవతలి వ్యక్తిని బలంగా తన్నిన యువతి, మురికి కాలువ నుంచి పైకి వచ్చి సీన్ తిలకించిన ఎలుకలు
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది అమ్మాయిలు నడిరోడ్డుపై గొడవ పడుతున్నారు. చీర కట్టుకున్న ఓ యువతి ఒక్కసారిగా బ్రూస్ లీ లాగా మారిపోయింది. కోపంతో ఊగిపోతూ కాలెత్తి అవతలి వ్యక్తిని బలంగా తన్నింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొంతమంది అమ్మాయిలు నడిరోడ్డుపై గొడవ పడుతున్నారు. చీర కట్టుకున్న ఓ యువతి ఒక్కసారిగా బ్రూస్ లీ లాగా మారిపోయింది. కోపంతో ఊగిపోతూ కాలెత్తి అవతలి వ్యక్తిని బలంగా తన్నింది. విచిత్రమేమిటంటే... సమీపంలో ఉన్న మురికి కాలువపై ఉన్న గట్టర్ నుంచి ఎలుకలు వచ్చి ఈ గొడవను ఆసక్తిగా తిలకించాయి. తలలు పైకెత్తి వారి గొడవను చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ కనిపించాయి. గొడవను చిత్రీకరిస్తున్న వ్యక్తి ఎలుకల ఆసక్తికి ముచ్చటపడి వాటిని కూడా వీడియోలోకి తీసుకొచ్చాడు. వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పటికే 1.8 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు. ‘ఘర్ కే కాలేశ్’ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. ఉత్తరప్రదేశ్‌లో దారుణం..జ్యూస్ లో మూత్రం పోసి అమ్ముతున్న వైనం, చితక్కొట్టిన ప్రజలు..వీడియో వైరల్
Here's Video