Shreyas Iyer Duck Video: శ్రేయ‌స్‌ అయ్యర్ డ‌కౌట్ వీడియో ఇదిగో, స‌న్‌గ్లాసెస్ పెట్టుకుని మరీ గోల్డన్ డక్, ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

దులీప్ ట్రోఫీలో ఇండియా-డీ జ‌ట్టు తరఫున ఆడుతున్న శ్రేయ‌స్‌ అయ్యర్ తాజాగా డ‌కౌట్ అయ్యాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో 7 బంతులు ఎదుర్కొని ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ చేరాడు. క్రీజులోకి వ‌చ్చిన అయ్య‌ర్ స‌న్‌గ్లాసెస్ పెట్టుకుని బ్యాటింగ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

Shreyas Iyer wearing sunglasses while batting (Photo credit: JioCinema)

దులీప్ ట్రోఫీలో ఇండియా-డీ జ‌ట్టు తరఫున ఆడుతున్న శ్రేయ‌స్‌ అయ్యర్ తాజాగా డ‌కౌట్ అయ్యాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో 7 బంతులు ఎదుర్కొని ప‌రుగుల ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్ చేరాడు. క్రీజులోకి వ‌చ్చిన అయ్య‌ర్ స‌న్‌గ్లాసెస్ పెట్టుకుని బ్యాటింగ్ చేయ‌డం గ‌మ‌నార్హం. దాంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా అత‌నిపై విప‌రీతంగా ట్రోల్స్ వ‌స్తున్నాయి. కంటిచూపు స‌మ‌స్య ఉంటే బ్యాట‌ర్లు కాంటాక్ట్  లెన్సులు, క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుంటారు గానీ స‌న్‌గ్లాసెస్ కాదు అని ట్రోలింగ్ చేస్తున్నారు.

దంచికొట్టిన డికాక్, వీడియో చూస్తే షాకవడం పక్కా!

త‌న‌ మొదటి దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో అయ్యర్ త‌న రెండు ఇన్నింగ్స్‌ల‌లో వ‌రుస‌గా 9, 54 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. దాంతో బంగ్లాదేశ్‌తో మొద‌టి టెస్టుకు బీసీసీఐ సెలెక్ట‌ర్లు అయ్య‌ర్‌ను ప‌క్క‌న పెట్టారు. ఇక‌ బంగ్లాతో జరిగే రెండో టెస్టుకు బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించలేదు. కానీ, అత‌ని తాజా ప్ర‌ద‌ర్శ‌న మ‌రోసారి నిరాశ‌ప‌రిచింది.

Here' s Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now