South Africa Beat Afghanistan: మూడో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసిన సఫారీలు, 2-1తో సిరీస్ కైవసం చేసుకున్న అఫ్గన్లు
సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసింది.అనూహ్య రీతిలో తొలి రెండు మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది అఫ్గనిస్తాన్.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అఫ్గనిస్తాన్.. సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ముగిసింది.అనూహ్య రీతిలో తొలి రెండు మ్యాచ్ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది అఫ్గనిస్తాన్. అయితే, నామమాత్రపు మూడో వన్డేలో మాత్రం ప్రొటిస్ జట్టు అఫ్గన్‌పై పైచేయి సాధించింది. ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కు తగ్గించింది. షార్జా వేదికగా ఆదివారం జరిగిన చివరి వన్డేలో 7 వికెట్ల తేడాతో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసింది.
ఇదేమి రనౌట్ బాబోయ్, అఫ్గన్ బ్యాటర్ రహ్మత్ షా అవుటైన తీరు నెట్టింట వైరల్, వీడియో మీరే చూడండి
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి.. 34 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఎయిడెన్ మార్క్‌రమ్ (67 బంతుల్లో 69 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)