Sheetal Devi's Bullseye Shot Video: కాలితో విల్లు ఎక్కుపెట్టి శీతల్ కొట్టిన షాట్‌కు ఫిదా అయిన సెలబ్రిటీలు, ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్ అంటూ విషెస్
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్‌గా సుమారు గత ఏడాది మహీంద్ర కారును బహుమతిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కాలితో విల్లు ఎక్కుపెట్టి శీతల్ కొట్టిన షాట్‌కు బార్సిలోనా ఫుట్‌బాల్ స్టార్ జౌలెస్ కుందె, టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫిదా అయ్యారు
పారిస్ పారాలింపిక్స్‌లో ఆర్చర్ శీతల్ దేవి తన అద్భుత ప్రతిభతో యావత్ క్రీడా ప్రపంచాన్నీ అబ్బురపర్చింది. 17 ఏళ్ల శీతల్ త్రుటిలో పతకాన్ని చేజార్చుకున్నప్పటికీ అదిరిపోయే షాట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో (para-archer) పోటీ పడిన శీతల్ కాలితో విల్లు ఎక్కి పెట్టి తొలి షాట్‌లో పది పాయింట్లను కొట్టింది. శీతల్ షాట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్చర్ శీతల్ దేవి అదిరిపోయే షాట్ వీడియో ఇదిగో, నీకు కారు గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాను అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ అపురూపమైన క్షణాలను ఆస్వాదించారు. ఆమె క్రీడా స్ఫూర్తికి సెల్యూట్‌గా సుమారు గత ఏడాది మహీంద్ర కారును బహుమతిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కాలితో విల్లు ఎక్కుపెట్టి శీతల్ కొట్టిన షాట్‌కు బార్సిలోనా ఫుట్‌బాల్ స్టార్ జౌలెస్ కుందె, టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఫిదా అయ్యారు. శీతల్ ప్రదర్శన అత్యద్భుతం అని కొనియాడారు.
Here's Tweets
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)