Swiggy Delivery Boy: స్విగ్గీ సంస్థపై డెలివరీ బాయ్ ఫైర్.. మాంసం, ఆల్కాహాల్ సరఫరా చేయనని ఉద్యోగానికి రాజీనామా, మత విశ్వాసమే ముఖ్యమని వెల్లడించిన డెలివరీ బాయ్
స్విగ్గీ(Swiggy) సంస్థపై ఓ డెలివరీ బాయ్ ఫైర్ అయ్యారు. తన మత విశ్వాసాలకు అడ్డుగా నిలిచిన స్విగ్గీ సంస్థలో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
స్విగ్గీ(Swiggy) సంస్థపై ఓ డెలివరీ బాయ్ ఫైర్ అయ్యారు. తన మత విశ్వాసాలకు అడ్డుగా నిలిచిన స్విగ్గీ సంస్థలో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. మథుర, వృందావనాలలో ఆన్‌లైన్ ద్వారా మాంసాహారపు ఆహారాన్ని డెలివర్ చేయడంపై వివాదం చెలరేగింది. వృందావనానికి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్(Delivery Boy) మాంసాహారాన్ని డెలివర్ చేయడానికి నిరాకరించి, తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.
తన మతపరమైన నమ్మకాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వృందావనంలో మాంసం, మద్యం అమ్మకాలు చట్టపరంగా నిషేధించబడ్డాయి కానీ ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా మాంసాహారాన్ని ఆర్డర్ చేసి డెలివర్ చేయడం జరుగుతోందని, ఇది స్థానిక సంప్రదాయాలకు విరుద్దమని భావించి ఉద్యోగాన్ని వదులుకున్నట్లు తెలిపాడు. షాకింగ్ వీడియో ఇదిగో, రెండో అంతస్తు నుండి ఒక్కసారిగా కిందపడిన కారు, సీసీటీవీ కెమెరాలో రికార్డయిన పడిపోతున్న దృశ్యాలు
Swiggy Delivery Boy refuses to Deliver Meat and Alcohol
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)