UP Road Accident: యూపీలో ఘోరం.. టైరు పేలడంతో ట్రక్కును ఢీకొట్టిన కారు.. చిన్నారి సహా 8 మంది సజీవ దహనం (వీడియోతో)
కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో చిన్నారి సహా 8మంది సజీవ దహనమయ్యారు. బాధితులు ఓ వివాహానికి హాజరై వస్తుండగా శనివారం రాత్రి బరేలీ జాతీయ రహదారిపై జరిగిందీ ఘటన.
Newdelhi, Dec 10: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని భోజిపురాలో ఘోరం జరిగింది. కారు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో చిన్నారి సహా 8మంది సజీవ దహనమయ్యారు. బాధితులు ఓ వివాహానికి హాజరై వస్తుండగా శనివారం రాత్రి బరేలీ జాతీయ రహదారిపై (National Highway) జరిగిందీ ఘటన. ప్రమాదం తర్వాత కారు సెంట్రల్ లాక్ (Central Lock) పడిపోవడంతో లోపలున్న వారు తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. కారు టైరు పేలిపోవడంతో అదుపుతప్పి అవతిలి రోడ్డులో ఉత్తరాఖండ్ నుంచి ఇసుకతో వస్తున్న ట్రక్కును ఢీకొట్టి నుజ్జునుజ్జు అయింది. కారును ట్రక్కు కొంతదూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగాయి. కారు డోర్లు లాక్ కావడంతో లోపల ఉన్నవారు తప్పించుకోలేకపోయారు. కారు నుంచి చిన్నారి సహా ఏడుగురి కాలిన మృతదేహాలను బయటకు తీశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)