Donald Trump-Melania's Dance Video: వీడియోలు ఇవిగో, భార్యతో కలిసి కత్తి పట్టుకుని డ్యాన్స్ వేసిన డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతల స్వీకరణ

ఈ ప్రమాణ స్వీకారోత్సం కార్యక్రమం జరిగిన స్టేజ్‌పై ట్రంప్‌ తన సతీమణి, అమెరికా ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్‌ (Melania Trump)తో కలిసి డ్యాన్స్‌ చేశారు.తన చేత్తో కత్తిపట్టుకుని డ్యాన్స్‌ (Dances With Military Sword) చేసి అలరించారు ట్రంప్‌

Donald Trump & Melania Dance Video (photo-@TheCalvinReport)

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) బాధ్యతలు స్వీకరించారు. యూఎస్‌ క్యాపిటల్‌లో వాషింగ్టన్‌లో సోమవారం రాత్రి ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ జాన్‌ రాబర్ట్స్‌ డొనాల్డ్ ట్రంప్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్‌ (JD Vance) బాధ్యతలు స్వీకరించారు.

ఈ ప్రమాణ స్వీకారోత్సం కార్యక్రమం జరిగిన స్టేజ్‌పై ట్రంప్‌ తన సతీమణి, అమెరికా ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్‌ (Melania Trump)తో కలిసి డ్యాన్స్‌ చేశారు.తన చేత్తో కత్తిపట్టుకుని డ్యాన్స్‌ (Dances With Military Sword) చేసి అలరించారు ట్రంప్‌ . ఆ సమయంలో స్టేజ్‌పై ఉన్న మెలానియా ట్రంప్‌, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్‌ దంపతుల ముఖంలో నవ్వులు విరబూశాయి. అదేవిధంగా ట్రంప్‌ దంపతులతోపాటు జేడీ వ్యాన్స్‌ దంపతులు కూడా డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

డొనాల్డ్‌ ట్రంప్‌ డ్యాన్స్ వీడియో ఇదిగో, ఐకానిక్‌ స్టెప్పులతో అదరగొట్టిన అమెరికా అధ్యక్షుడు, 78 ఏళ్ల వయసులో అగ్రరాజ్యాధినేతగా మరోసారి బాధ్యతలు

Donald Trump & Melania Dance Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now