Uttar Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, కరెంట్ షాక్ కొట్టి 22 సెకండ్లలోనే ప్రాణాలు కోల్పోయిన యువకుడు, వెదురు కర్ర హై టెన్సన్ వైర్లకు తగలడంతో షాక్
ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో లైవ్ వైర్ తగిలి విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందాడు . ఈ సంఘటన, అతని ఇంటిలోని సిసిటివిలో బంధించబడింది, సంఘటన జరిగిన 22 సెకన్లలో యువకుడు ప్రాణాలను కోల్పోయాడు
ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో లైవ్ వైర్ తగిలి విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందాడు . ఈ సంఘటన, అతని ఇంటిలోని సిసిటివిలో బంధించబడింది, సంఘటన జరిగిన 22 సెకన్లలో యువకుడు ప్రాణాలను కోల్పోయాడు. వీడియో ఫుటేజీలో యువకుడు వెదురు కర్రను మోసుకెళ్లినప్పుడు అతను అనుకోకుండా ఓవర్ హెడ్ విద్యుత్ లైన్‌ను తాకినట్లుగా వీడియో ద్వారా తెలుస్తోంది. అనంతరం ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. పక్కనున్న వారు అతన్ని బతికించుకునేందుకు చేతులు, కాళ్లను రుద్ది వేడి రాజేసినా అతను అప్పటికే ప్రాణాలు వదిలేశాడు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. వర్షం పడుతుండగా విద్యుత్ స్తంభాన్ని తాకడంతో కరెంట్ షాక్, హైదరాబాద్‌లో ఓ వ్యక్తి మృతి, వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)