Viral Video: వీడియో ఇదిగో, మియాపూర్‌లో చెంచాతో పాలు తాగుతున్నపోచమ్మ తల్లి, చూసేందుకు దేవాలయానికి బారులు తీరిన భక్తులు
మియాపూర్ లో వింత ఘటన చోటు చేసుకుంది. పాలు తాగుతున్నపోచమ్మ తల్లి వీడియో వైరల్ అవుతోంది. మియాపూర్ మదీనాగూడ పోచమ్మ దేవాలయం లో మూడు రోజులుగా చెంచాతో పాలు తాగుతున్న అమ్మవారు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Village Deity Pochamma Drinking Milk Video: మియాపూర్ లో వింత ఘటన చోటు చేసుకుంది. పాలు తాగుతున్నపోచమ్మ తల్లి వీడియో వైరల్ అవుతోంది. మియాపూర్ మదీనాగూడ పోచమ్మ దేవాలయం లో మూడు రోజులుగా చెంచాతో పాలు తాగుతున్న అమ్మవారు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకెళితే..పోచమ్మతల్లి దేవత భక్తులు సమర్పించిన పాలు తాగుతున్న అరుదైన, అద్భుతమైన ఘట్టం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మదీనాగూడాలో చోటుచేసుకుంది. గత మూడు రోజులుగా భక్తులు సమర్పించిన పాలను అమ్మవారు తాగుతున్నట్లు ఆలయ పూజారి నవీన్ కుమార్ తెలిపారు. ఇదే విషయం ఆలయ కమిటీ వారికి తెలుపగా శుక్రవారం ఉదయం వారు స్వయంగా అమ్మవారికి చెంచాతో పాలు పట్టించారు. అమ్మవారు పాలును స్వీకరించినట్లు గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు పోచమ్మ తల్లి దేవాలయానికి బారులు తీరారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)