Vinesh Phogat Disqualification: విభాగానికి సరిపోయేంత బ‌రువు ఉండ‌డం అనేది అథ్లెట్ల బాధ్య‌త, వినేశ్ ఫోగాట్ అప్పీల్‌పై 24 పేజీల తీర్పును వెల్లడించిన కాస్

ఏ కార‌ణం చెప్ప‌కుండానే వినేశ్ ఫోగొట్‌కు ప‌త‌కం నిరాక‌రించ‌డాన్ని అంద‌రూ ప్ర‌శ్నిస్తున్న నేప‌థ్యంలో కాస్ సోమ‌వారం 24 పేజీల సుదీర్ఘ‌ తీర్పును వెల్ల‌డించింది. విభాగానికి సరిపోయేంత బ‌రువు ఉండ‌డం అనేది అథ్లెట్ల బాధ్య‌త అని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఎవ‌రికీ మిన‌హాయింపులు ఉండ‌వని కాస్ చెప్పింది.

CAS postpones verdict on Vinesh Phogat Olympic silver medal appeal further, next update on August 16(X)

ఒలింపిక్స్‌లో భార‌త రెజ్ల‌ర్ వినేశ్ ఫోగాట్ (Vinesh Phogat) ర‌జ‌తం దక్కని విషయం విదితమే. ఏ కార‌ణం చెప్ప‌కుండానే వినేశ్ ఫోగొట్‌కు ప‌త‌కం నిరాక‌రించ‌డాన్ని అంద‌రూ ప్ర‌శ్నిస్తున్న నేప‌థ్యంలో కాస్ సోమ‌వారం 24 పేజీల సుదీర్ఘ‌ తీర్పును వెల్ల‌డించింది. విభాగానికి సరిపోయేంత బ‌రువు ఉండ‌డం అనేది అథ్లెట్ల బాధ్య‌త అని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఎవ‌రికీ మిన‌హాయింపులు ఉండ‌వని కాస్ చెప్పింది.

వినేశ్ ఫొగాట్ విష‌యంలోనూ తాము అదే నియ‌మాన్ని అనుస‌రించామ‌ని అర్బిట్రేష‌న్ కోర్టు త‌న 24 పేజీల తీర్పులో తెలిపింది. అథ్లెట్ల‌కు స‌మ‌స్య ఏంటంటే బ‌రువు విష‌యంలో రూల్ అంటే రూల్. అది పోటీల్లో పాల్గొనే అంద‌రికీ ఒకేలా ఉంటుంది. నిర్ణీత బ‌రువు కంటే ఏ కొంచెం ఎక్కువున్నా ఉపేక్షించేది లేదు. విభాగానికి త‌గ్గ బ‌రువు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్య‌త పూర్తిగా రెజ్ల‌ర్‌దే” అని కాస్ వెల్ల‌డించింది. వినేశ్ ఫోగట్ ఎప్పుడూ మాకు ఛాంపియనే, ప్రజల హృదయాలను గెలచుకుందన్న తల్లి ప్రేమలత

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)