Viral video: షాకింగ్ వీడియో, గుంతల రోడ్లు చూడండి అంటూ రిపోర్టర్ లైవ్ ఇస్తుండగా వెనక గుంతలో పడిన ఆటో, వైరల్ అవుతున్న క్లిప్
అక్కడి పరిస్థితిని చెబుతూ సెల్ఫీ వీడియో తీస్తున్నారు. ఆ వెనుక రోడ్డు అంతా గుంతలు పడి, బురదతో నిండి ఉంది
యూపీలో గుంతల రోడ్లు, వాటితో జరుగుతున్న ప్రమాదాలపై రిపోర్టర్ న్యూస్ కవర్ చేస్తున్నారు. అక్కడి పరిస్థితిని చెబుతూ సెల్ఫీ వీడియో తీస్తున్నారు. ఆ వెనుక రోడ్డు అంతా గుంతలు పడి, బురదతో నిండి ఉంది. ఇదే సమయంలో అటుగా వస్తున్న ఓ ఎలక్ట్రిక్ ఆటో గుంతల మీదుగా వెళ్తూ.. బురదలోనే బోల్తా పడింది. అందులో ఉన్నవారంతా ఆ బురదలో పడిపోయారు.
వెంటనే ఆయన వీడియో తీయడం ఆపేసి ఆటోలోని వారిని రక్షించే పనిలో పడ్డారు. ఆయనతో పాటు సమీపంలోని వ్యక్తులు బోల్తా పడిన ఆటోలోని వారిని బయటికి తీశారని తర్వాత ఆయన వివరించారు. ఘటన గురించి తెలిసి స్థానిక అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసినట్టుగా తెలిపారు.ట్విట్టర్ లో ఈ వీడియోకు నాలుగు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. పెద్ద సంఖ్యలో లైక్ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)