Suicide Threat on Metro Track: ఢిల్లీలో మెట్రో ట్రాక్‌ పైనుంచి దూకడానికి యత్నించిన యువతి.. ఆ తర్వాత?? (వీడియోతో)

న్యూఢిల్లీలో మెట్రో రైలు ట్రాక్‌ పైనుంచి దూకడానికి ఓ యువతి ప్రయత్నించింది. సోమవారం సాయంత్రం షాదీపూర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి ట్రాక్‌ పైకి ఓ యువతి వచ్చింది.

Suicide Threat on Metro Track (Credits: X)

Newdelhi, Dec 12: న్యూఢిల్లీలో (Delhi) మెట్రో రైలు ట్రాక్‌ (Metro Track) పైనుంచి దూకడానికి ఓ యువతి ప్రయత్నించింది. సోమవారం సాయంత్రం షాదీపూర్‌ మెట్రో స్టేషన్‌ (Shadipur Metro Station) నుంచి ట్రాక్‌ పైకి ఓ యువతి వచ్చింది. చేతిలో మొబైల్‌ ఫోన్‌ పట్టుకుని ట్రాక్‌ రేలింగ్‌ పై కాలు పెట్టి దూకి ఆత్మహత్య (Suicide) చేసుకోవాలనుకుంది. అయితే కింది నుంచి వెళ్తున్నవారు ఆమెను గమనించి వారించారు. దీంతో ఆమెను మాటల్లో పెట్టిన అధికారులు.. పోలీసులను ఆమె వద్దకు పంపించారు. క్షణాల్లోనే అక్కడికి చేరుకున్న పోలీసులు, మెట్రో సిబ్బంది ఆ యువతిని క్షేమంగా కిందికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. అయితే, యువతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది.

Biryani at Rs. 2: హైదరాబాద్ బిర్యానీ ప్రియులకు శుభవార్త.. రూ.2కే పసందైన బిర్యానీ.. నాన్‌ వెజ్‌ లేదా వెజిటబుల్‌ బిర్యానీ ఏది తీసుకున్నా అంతే ధర.. అయితే, ఒకేఒక నిబంధన.. అది కూడా చాలా చిన్నది. ఏంటంటే??

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement