Hyderabad, Dec 12: హైదరాబాద్ (Hyderabad) అంటేనే బిర్యానీ (Biryani) సువాసనలు. మరి అలాంటి బిర్యానీ ప్రియులకు ఓ శుభవార్త. పసందైన బిర్యానీ కేవలం రూ.2కే (Biryani at Rs. 2) ఆస్వాదించొచ్చు. ఈ బిర్యానీని నాయుడిగారి కుండ బిర్యానీ రెస్టారెంట్ యాజమాన్యం రూ.2కే ఆఫర్ చేస్తున్నది. అయితే, ఇక్కడ ఓ చిన్న నిబంధన పెట్టారు నిర్వాహకులు. రూ.2 నోట్ ను తీసుకువచ్చిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని యాజమాన్యం పేర్కొంది.
Exchange Rs 2 note for Rs 2 biryani at Naidu Gari Kunda Biryani in Hyderabad
— NewsMeter (@NewsMeter_In) December 10, 2023
రూ.2 నోట్ ను ఇచ్చి నాన్ వెజ్ బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీలో ఏదైనా రుచి చూడొచ్చని తెలిపింది. రూ.2 నోట్ తీసుకొచ్చిన వారు రెస్టారెంట్ లో వెబిటబుల్, చికెన్, మటన్ దమ్ బిర్యానీలు, ముఘలాయి చికెన్ బిర్యానీ, దిల్కుష్ చికెన్ బిర్యానీ, జపనీస్ కంజుపిట్ట బిర్యానీ, చేపలు, రొయ్యల బిర్యానీలతో సహా పలు రకాల బిర్యానీల్లో ఏదో ఒకటి తీసుకోవచ్చని తెలిపారు.