Telangana Assembly. (Photo credits: PTI)

Hyd, Dec 11: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. స్పీకర్‌ ఎన్నిక తేదీని ఖరారు (Telangana Assembly Speaker Election) చేస్తూ అసెంబ్లీ సెక్రటేరియట్‌ సోమవారం(డిసెంబర్‌11)నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్పీకర్‌ పదవికి పోటీపడే వారే నుంచి ఈ నెల 13న ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే అంతకు ముందు ఉన్న శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు.

ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ నుంచే స్పీకర్‌ ఎన్నికవనున్నారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్‌కు (Vikarabad MLA Gaddam Prasad Kumar) స్పీకర్‌ పదవి ఇవ్వాలని కాంగ్రెస్‌ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ప్రసాద్​ కుమార్​ కు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్​ కుమార్​ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. అయితే స్పీకర్‌ ఎన్నిక (Assembly Speaker Election Notification) ఏకగగ్రీవం కావాలంటే కాంగ్రెస్‌ పార్టీ తరపున ఒక్క నామినేషన్ మాత్రమే రావాల్సి ఉంటుంది. ఎవరైనా ఇతర సభ్యులు పోటీలో ఉంటే బ్యాలెట్‌ ద్వారా స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్‌ ఆధ్వర్యంలో స్పీకర్‌ ఎన్నిక జరగనుంది.

వీడియో ఇదిగో, కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు, త్వరలోనే కేసీఆర్‌ మామూలుగా నడుస్తారని ఆకాంక్షించిన మాజీ సీఎం

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఈనెల 9న మూడో శాసనసభ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు శాసనసభలో సీనియర్​ నేత అయిన ఎంఐఎం అధ్యక్షుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఒవైసీ ప్రొటెం స్పీకర్(Pro-tem Speaker)​గా వ్యవహరించారు. ముందుగా ఆయన రాజ్ భవన్‌​లో ప్రొటెం స్పీకర్​గా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం శాసనసభలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 100 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు.

మంత్రులలో ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి ఎంపీలుగా రాజీనామా చేయకపోవడం వల్ల ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేలలో 101 మంది మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ను ప్రొటెం స్పీకర్​గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ గైర్హాజరయ్యారు.మరోవైపు బీఆర్ఎస్​లో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు.

బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్‌ ఎన్నిక

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 ఎన్నికల్లో 119 స్థానాల్లో కాంగ్రెస్​ పార్టీ తన మిత్రపక్షం సీపీఐతో కలిసి 65 స్థానాల్లో గెలుపొందగా, బీఆర్​ఎస్​ 39 స్థానాల్లోనూ, బీజేపీ 8 స్థానాలు, ఎంఐఎం పార్టీ 7 స్థానాల్లో విజయం సాధించింది.