Hyderabad, Dec 9: బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా (BRSLP leader) ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ఎన్నికయ్యారు. బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన శనివారం ఉదయం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా పార్టీ అధినేత కేసీఆరే ఉండాలని ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యేలు బలపరిచారు. దీంతో బీఆర్‌ఎస్‌ఎల్పీ లీడర్‌గా పార్టీ అధినేత కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)