Viral Video: వైరల్ వీడియో, మందుకు బానిసైన కోతి, మందు బాబులపై దాడి చేసి వారి మద్యం ఎత్తుకుపోతున్న వానరం, బెంబేలెత్తుతున్న మందుబాబులు

ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి జిల్లాలో మద్యానికి బానిసైన కోతి మద్యం బాబులను ముప్పతిప్పలు పెడుతోంది. మద్యం సీసాలు కొనుక్కుని వెళ్తున్న వారిపై దాడిచేసి వాటిని లాక్కుంటున్న ఈ కోతి. ఎదిరిస్తే మాత్రం తిరగబడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

monkeys

ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి జిల్లాలో మద్యానికి బానిసైన కోతి మద్యం బాబులను ముప్పతిప్పలు పెడుతోంది. మద్యం సీసాలు కొనుక్కుని వెళ్తున్న వారిపై దాడిచేసి వాటిని లాక్కుంటున్న ఈ కోతి. ఎదిరిస్తే మాత్రం తిరగబడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దాని దాడులకు భయపడుతున్న వినియోగదారులు మద్యం దుకాణానికి వెళ్లడం మానేస్తున్నారు.తాజాగా బీరు క్యాన్‌ను గటగటా తాగేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

కోతి ఆగడాలపై మద్యం వ్యాపారులు, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుకున్న జిల్లా ఎక్సైజ్ అధికారి రాజేంద్ర ప్రసాద్ సింగ్ మాట్లాడుతూ.. అటవీ అధికారుల సాయంతో కోతిని బంధించేందుకు ప్రయత్నిస్తామన్నారు. కాగా, లక్నో-కాన్పూరు రోడ్డులోని నవాబ్‌గంజ్ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అక్కడ ఓ కోతి లిక్కర్ షాపునకు పర్మనెంట్ కస్టమర్‌గా మారింది. చిల్ల్డ్ బీరుపై మనసు పారేసుకున్న ఈ వానరానికి ఓ కస్టమర్ ప్రతి రోజు బీర్ బాటిల్ కొనిచ్చేవాడు. ఆ తర్వాత ఆ వానరం కాలేయం పెరిగి చనిపోయింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement