Dickie Bird Dies: దిగ్గజ క్రికెట్ అంపైర్ డికీ బర్డ్ కన్నుమూత, 32 ఏళ్లకే ఆటకు వీడ్కోలు చెప్పి అంపైరింగ్ వైపు..హస్యంతో క్రికెట్ ప్రేమికులను కట్టిపడేసిన లెజెండ్
ప్రఖ్యాత క్రికెట్ అంపైర్ హెరాల్డ్ డెనిస్ డికీ బర్డ్ (92) మంగళవారం లండన్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధికారికంగా ప్రకటించింది. 2014లో ఆయన ఆ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1933 ఏప్రిల్ 19న యార్క్‌షైర్‌లో జన్మించిన డికీ బర్డ్ చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నారు.
ప్రఖ్యాత క్రికెట్ అంపైర్ హెరాల్డ్ డెనిస్ డికీ బర్డ్ (92) మంగళవారం లండన్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధికారికంగా ప్రకటించింది. 2014లో ఆయన ఆ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1933 ఏప్రిల్ 19న యార్క్‌షైర్‌లో జన్మించిన డికీ బర్డ్ చిన్నతనం నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నారు. జెఫ్రీ బాయ్‌కాట్, మైఖేల్ పార్కిన్సన్‌లతో కలిసి యార్క్‌షైర్ తరఫున ఆడారు. 1956–1964 మధ్య Yorkshire, Leicestershire తరఫున 93 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 3,314 పరుగులు సాధించారు. గ్లామోర్గన్‌పై 181 నాటౌట్ ఆయన అత్యుత్తమ స్కోర్.
ఆటగాడిగా రాణించినప్పటికీ, ఆయనకు అసలైన పేరు అంపైరింగ్ ద్వారానే వచ్చింది. 32 ఏళ్లకే ఆటకు వీడ్కోలు చెప్పి కోచింగ్ వైపు మొగ్గారు. అనంతరం 1973లో ఇంగ్లండ్–న్యూజిలాండ్ టెస్ట్‌తో అంపైర్‌గా అరంగేట్రం చేశారు. తన కెరీర్‌లో 66 టెస్టులు, 69 వన్డేలు, మూడు వరల్డ్ కప్ ఫైనల్స్‌కు అంపైర్‌గా వ్యవహరించారు. హాస్యం, వైవిధ్యమైన తీరు ఆయన అంపైరింగ్‌కు ప్రత్యేకతను తెచ్చాయి. 1995లో ఓల్డ్ ట్రాఫర్డ్‌లో అధిక సూర్యకాంతి కారణంగా ఆట నిలిపిన సంఘటన ఆయన శైలికి ఉదాహరణ.
అంపైరింగ్‌తో పాటు రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రాసిన My Autobiography యూకేలో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు MBE (Member of the Order of the British Empire) పురస్కారం లభించింది. అదేవిధంగా యార్క్‌షైర్‌లో ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. క్రికెట్ ఆటగాడిగా, కోచ్‌గా, అంపైర్‌గా, రచయితగా నాలుగు కోణాల్లో రాణించిన డికీ బర్డ్ పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది.
Legendary English Umpire Passes Away at 92
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)