Shane Warne No More: మాటలు రావడం లేదు, ఇంత త్వరగా కాలం చేయడం విషాదకరం, షేన్‌ వార్న్‌ మృతిపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ సంతాపం

షేన్‌ వార్న్‌ మృతి విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. మాటలు రావడం లేదు. క్రికెట్‌ ప్రపంచంలో లెజెండ్‌. ఆటలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి. ఇంత త్వరగా కాలం చేయడం విషాదకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ అని వీవీఎస్‌ లక్ష్మణ్‌ సంతాపం తెలిపారు.

Shane-warneDead

ఆస్ట్రేలియా మాజీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ ఆకస్మిక మరణం క్రికెట్ ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేసింది. ఈ ఉదయం ఆసీస్ దిగ్గజం రాడ్ మార్ష్ మృతితో విషాదంలో ఉన్న క్రికెట్ వర్గాలను తాజాగా వార్న్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వార్న్ గురించిన వార్తలే కనిపిస్తున్నాయి. థాయ్‌లాండ్‌లోని ఓ విల్లాలో విగతజీవిగా కనిపించారు. ఆయన మృతిని కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

షేన్‌ వార్న్‌ మృతి విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. మాటలు రావడం లేదు. క్రికెట్‌ ప్రపంచంలో లెజెండ్‌. ఆటలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తి. ఇంత త్వరగా కాలం చేయడం విషాదకరం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి’ అని వీవీఎస్‌ లక్ష్మణ్‌ సంతాపం తెలిపారు.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement