Virat Kohli Dance Video: విరాట్ కోహ్లీ డ్యాన్స్ వీడియో ఇదిగో, రామ్ లఖన్ సినిమాలోని మైనేమ్ ఈజ్ లఖన్ పాటకు చిందేసిన టీమిండియా స్టార్

విరాట్ కోహ్లీ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’పాటకు మైదానంలో కాలు కదిపిన కోహ్లీ.. నిన్న శ్రీలంకతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రామ్ లఖన్ సినిమా పాటకు స్టెప్పులేసి అలరించాడు.

Virat Kohli Joins Fun With Perfect Steps Against Sri Lanka Viral Video

విరాట్ కోహ్లీ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’పాటకు మైదానంలో కాలు కదిపిన కోహ్లీ.. నిన్న శ్రీలంకతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రామ్ లఖన్ సినిమా పాటకు స్టెప్పులేసి అలరించాడు.బౌండరీ లైన్ వద్ద కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ‘రామ్ లఖన్’ సినిమాలోని ‘మైనేమ్ ఈజ్ లఖన్’ అని గ్యాలరీలోని ఫ్యాన్స్ పాడడం మొదలుపెట్టారు.

ఆ పాట కాస్తా విరాట్ చెవిన పడడంతో కాలు కదపకుండా ఉండలేకపోయాడు. ఆ పాటకు పర్‌ఫెక్ట్‌గా రెండు స్టెప్పులు వేసి అలరించాడు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ 88 పరుగుల వద్ద అవుటై సెంచరీ‌తోపాటు సచిన్ వన్డే సెంచరీల రికార్డును సమం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

Virat Kohli Joins Fun With Perfect Steps Against Sri Lanka Viral Video

Heres' Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now